విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న 70.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో ఉన్న సహజ సిద్దమైన వన్యప్రాణి అభయారణ్యం. స్క్రబ్ మరియు పచ్చికభూములతో కలిపిన పొడి సతత హరిత అడవి మరియు 70.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ అభయారణ్యం స్క్రబ్ మరియు పచ్చికభూములతో కలిపిన పొడి సతత హరిత అడవిని కలిగి ఉంది.
ఈ అభయారణ్యం తూర్పు కనుమల లోని అనేక రకాల వృక్ష జాతులను, జంతు జాలాన్ని కలిగి ఉంది. చిరుత పులి, నక్క, అడవి కుక్క, పంగోలిన్, అడవి పంది, మచ్చల పిల్లి, కొండచిలువ, అరుదైన పక్షులు, కీటకాలను కలిగి ఉంది.
ఈ అభయారణ్యం లో పర్యాటకుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎకో టూరిజం పార్క్ ఏర్పాటు చేసింది. వసతి కోసం కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మూడు మార్గాలలో ట్రెక్కింగ్ చేయవచ్చు. ఇక్కడ ఉన్న సరస్సులో బోటింగ్, కయకింగ్, హిచ్ హైకింగ్, గుర్రపు స్వారీ వంటి సాహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి.
సమీప పట్టణం & నగరం : విశాఖపట్నం
సమీప బస్ స్టేషన్ : ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ (8.4 కిమీ)
సమీప రైల్వే స్టేషన్: విశాఖపట్నం (10.3 కిమీ)
సమీప విమానాశ్రయం: విశాఖపట్నం (18.4 కిమీ)
సమీప భోజన మరియు వసతి సదుపాయాలు: విశాఖపట్నం
No comments:
Post a Comment