Tuesday, 16 March 2021

కోరింగ వన్యప్రాణి అభయారణ్యం, కోరంగి, తాళ్ళరేవు మండలం, తూర్పు గోదావరి జిల్లా


కోరింగ అభయారణ్యం గోదావరి ముఖ ద్వారం లో ఏర్పడిన మడ అడవులు. 235 చదరపు కిలోమీటర్ ల విస్తీర్ణంతో  సుందర్బన్ తరువాత దేశంలో రెండవ పెద్ద మడ అడవులు. చిత్తడినేలలో పెరిగే చెట్లయొక్క వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్‌ తీసుకొనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. వేర్ల ద్వారా గాలిపీల్చుకునే ఈ ' చిత్తడి అడవులు ' కేవలం నదీ సాగరసంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి (బురద) నేలల్లోనే పెరుగుతాయి. అన్ని నదీ సాగర సంగమాలు చిత్తడి నేలలని ఏర్పరచవు.  అందంగా, గుబురుగా, దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోతనుంచి భూమిని రక్షించే పెట్టని కోటలుగా ఉన్నాయి.  వివిధ రకాల పక్షిజాతులకు, ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119రకాల జీవజాలానికి ఇది ఆవాస ప్రాంతం. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు వలస పక్షులను చూడవచ్చు. జనవరి నుంచి మార్చి నెలల వరకు  సముద్రపు తాబేళ్ళు, సముద్ర తీరాన గుడ్లు పెట్టడానికై వస్తాయి. పడవల ద్వారా మడ అడవుల గుండా సముద్ర ముఖ ద్వారం వెళ్లి రావచ్చు. అలాగే ఇక్కడ ఉన్న పురాతన లైట్ వద్దకు కూడా పడవలో వెళ్ళవచ్చు. లైట్ హౌస్ హౌస్ నుండి మడ అడవుల సౌందర్యాన్ని, సుందర మైన సాగర తీరాన్ని వీక్షించవచ్చు. పర్యాటకుల కోసం రోప్ వాక్, వాచ్ టవర్, చెక్క బాట ఏర్పాటు చేసారు.  

location : 16.880452885486662, 82.24585146886638

సమీప పట్టణం : కాకినాడ (14.5 కిమీ)

సమీప ప్రధాన పర్యాటక కేంద్రం: రాజమహేంద్రవరం (64.9 కిమీ)

సమీప బస్ స్టేషన్ : కాకినాడ (11.9 కిమీ)

సమీప రైల్వే స్టేషన్ : కాకినాడ టౌన్ (12.1 కిమీ), సామర్లకోట (23.0 కిమీ)

సమీప విమానాశ్రయం: రాజమహేంద్రవరం (68.1 కిమీ)

సమీప వసతి మరియు భోజన సదుపాయం : కాకినాడ (14.5 కిమీ)  


No comments:

Post a Comment