location : 13.60347180264103, 79.57732892036168
గుడిమల్లం (జనాభా: 2 వేలు) ఏర్పేడు మండలం, చిత్తూరు జిల్లా
సమీప పట్టణం మరియు నగరం : తిరుపతి (20 కిమీ)
సమీప బస్ స్టేషన్ : తిరుపతి (20 కిమీ )
సమీప రైల్వే స్టేషన్ : రేణిగుంట (11 కిమీ)
సమీప విమానాశ్రయం: తిరుపతి (13 కిమీ)
సమీప భోజన మరియు వసతి సదుపాయాలు : తిరుపతి (20 కిమీ)
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో గుడిమల్లం అనే గ్రామం లో ఉన్న పరశు రామేసర స్వామి ఆలయం అత్యంత పురాతనమైనది. చాలా కాలం మరుగుపడిన ఈ ఆలయాన్ని 1911 లో శ్రీ గోపీనాధ రావు అనే పురాతత్వ వేత్త వెలుగులోకి తీసుకు వచ్చారు. ఇక్కడున్న శాసనాలను బట్టి ఈ ఆలయం ఒకటవ శతాబ్దంలో నిర్మించాబడినట్లు తెలియుచున్నది. ఇక్కడ శివలింగం ప్ఏరపంచంలో ఎక్డుకడా లేని విధంగా అడుగుల పొడుగుతో పురుష లింగాన్ని పోలి ఉంటుంది. 1954 వరకు గ్రామస్తుల అధీనం లో ఉన్న ఈ ఆలయం, ఆర్కియాలజీ సొసైటీ అఫ్ ఇండియా అధీనం లోకి వెళ్ళింది. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో ఎన్నో శాసనాలు చారిత్రక విశేషాలు బయట పడ్డాయి.
No comments:
Post a Comment