Friday, 5 March 2021

రామ నారాయణం, సారిక, విజయ నగరం మండలం & జిల్లా

 



విజయ నగరానికి సమీపంలో సారిక గ్రామంలో రామ నారాయణం పేరుతో 2014 లో SCS ఛారిటబుల్సు ట్రస్ట్  వ్యవస్థాపకులు అయిన శ్రీ నారాయణం నరసింహ మూర్తి గారి సంకల్పంతో అయన కుమారులు నిర్మించారు.  15 ఎకరాల విస్తీర్ణం లో శ్రీ మద్రామాయణ  ప్రాంగణం నిర్మించ బడింది. మధ్య భాగాన 80 అడుగుల ఎత్తు గల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. విల్లు మరియు బాణం ఆకారంలో ఈ ప్రాంగణ నిర్మాణానికి సుమారు దశాబ్ద కాలం పట్టింది. వాల్మీకి రామయణం ఆధారంగా మొత్తం కథ ను 3 డైమన్షన్ లో చెక్కబడ్డాయి. 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించి 72 విగ్రహాలను ఏర్పాటు చేసారు. ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగుఇంగ్లీష్హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసారు. సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోదలచినపుడు అక్కడ ఏ భాషలో కావాలంటే ఆ భాషను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు.   ధనుస్సు ఆకారంలో నిర్మింప బడిన ఈ కట్టడం పూర్తిగా రామాయణ సారాన్ని బోధిస్తుంది. ధనువు ఆకారం లోని తోలి సగం కారిడార్ లో 35, మలి సగం కారిడార్ లో 40 మొత్తం 75 కుడ్య చిత్రాలు ఉన్నాయి. కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు శోభాయ మానంగా ఉంటాయి. ఈ రెండు విగ్రహాల వద్ద కుడా ఫౌంటెన్ లు ఉన్నాయి. మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన నారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అద్వర్యంలో ఇక్కడ వేదం పాఠశాల నిర్వహిస్తున్నారు. 

location: 18.074697164838764, 83.36973311096854
సారిక గ్రామం, విజయనగరం మండలం & జిల్లా

సమీప పట్టణం : విజయ నగరం (5  కిమీ) 
సమీప ప్రధాన నగరం : విశాఖపట్నం (50 కిమీ)

సమీప బస్ స్టేషన్: విజయ నగరం (5 కిమీ)
సమీప రైల్వే స్టేషన్ : విజయ నగరం (6 కిమీ)
సమీప విమానాశ్రయం: విశాఖపట్నం (53 కిమీ) 

వసతి మరియు భోజన సదుపాయాలు : విజయ నగరం (5 కిమీ)

No comments:

Post a Comment