కడప జిల్లా లో పురావస్తు శాఖ అధీనంలో ఉన్న ఈ బౌద్ధ క్షేత్రం సుమారు 2 వ శతాబ్దానికి చెందినది. ఈ బౌద్ధ క్షేత్రం ఉన్న గుట్టను స్థానికంగా లంజకనుమ గుట్ట గా వ్యవహరిస్తారు. చెయ్యేరు నది ఈ గుట్టను ఆనుకుని ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశం గురించి 1912-1913 లో ప్రపంచానికి తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాల లో మహా స్థూపం, 21 స్తూపాలు, ఒక విహారం, చైత్యం, ఇటుకలతో నిర్మించిన వేదిక మరియు మెట్లు ఒక ఈ ప్రదేశంలో లభించాయి.
location: 14.26420103322216, 79.13159559938934 (నందలూరు, కడప జిల్లా)
సమీప బస్ స్టేషన్: రాజంపేట (12.5 కిమీ)
సమీప రైల్వే స్టేషన్: రాజంపేట (12.3 కిమీ)
సమీప విమానాశ్రయం: కడప (55.1 కిమీ)
సమీప పట్టణం: రాజంపేట (12.5 కిమీ)
సమీప ప్రధాన పర్యాటక కేంద్రం: (100 కిమీ)
సమీప వసతి మరియు భోజన సదుపాయాలు: రాజంపేట (12.5 కిమీ) & కడప (45 కిమీ)
No comments:
Post a Comment