Wednesday, 17 March 2021

గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం, కోర్సా వారి గూడెం, బుట్టాయ గూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా

 

తూర్పు కనుమలలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన గుబ్బలు గుబ్బలుగా ఉండే గుహలో వెలసిన దైవం గుబ్బల మంగమ్మ తల్లి. ఈ గుహ పై నుండి సంవత్సరం పొడుగునా సెలయేటి జలధారలు పడుతూ ఉంటాయి ఆలయ పరిసరాలు దట్టమైన అడవులు, ఎత్తైన కొండలతో, గలగలా పారే సెలయేళ్ళతో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. స్థానిక గిరిజనులు అమవారిని వన దేవతగా కొలుస్తారు. ఇక్కడ తెలంగాణా ప్రభుత్వం గుడ్ల గూబల వాచ్ టవర్ ఏర్పాటు చేసింది. 


location: 17.347494497363364, 81.3057362753186 (కోర్సా వారి గూడెం, బుట్టాయ గూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా)

సమీప పట్టణం: జంగారెడ్డి గూడెం (30 కిమీ)

ప్రధాన పర్యాటక స్థానం: రాజమహేంద్రవరం (89 కిమీ)

సమీప బస్ స్టేషన్: జంగారెడ్డిగూడెం (30.7 కిమీ)

సమీప రైల్వే స్టేషన్: తాడేపల్లిగూడెం (80.3 కిమీ)

సమీప విమానాశ్రయం: రాజమహేంద్రవరం (94.5 కిమీ)

సమీప వసతి మరియు భోజన సదుపాయలు: జంగారెడ్డిగూడెం (30 కిమీ)

No comments:

Post a Comment