Wednesday, 3 March 2021

బొజ్జన కొండ, రేబాక, అనకాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా

విశాఖ నగరంలో ని అనకాపల్లి కి 4 కిమీ దూరంలో చెన్నై-కోల్కతా జాతీయ రహదారికి ఎడమ వైపున 1.3 కిమీ దూరంలో ఉన్న రెండు కొండల్లో తూర్పు వైపున ఉన్న కొండను బొజ్జన కొండ గా పిలుస్తారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ది చెందిన బౌద్ క్షేత్రాల్లో ఒకటి అనేక ఏక శిలా స్తూపాలు, చైత్యాలు ఉన్నాయి. ఇవి క్రీస్తు శకం 4 వ శతాబ్దం నుండి 9 వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డాయి.


ఈ కొండపై పశ్చిమ వాలు అంట ఏక శిలా స్థూపాల  సమూహాలతో నిండి ఉంటుంది. ఇవన్నీ రాక్ కట్ నిర్మాణాలు. వీటి చివర ఉన్న ఉన్న వృత్తాకార స్థూపం ఇటుకలతో నిర్మించబడింది.   


గ్రామం/ పట్టణం: రేబాక, అనకాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా 

location: 17.710235602842097,83.01604612000789

జనాభా: సుమారు 3 వేలు.

రవాణా సదుపాయాలు 

ఇది చెన్నై - కోల్కతా జాతీయ రహదారి-16 కి ఎడమ చేతి వైపున 1.3 కిమీ దూరం లో ఉంది.

సమీప పట్టణం: - విశాఖపట్నం (40 కిమీ)

సమీప ప్రధాన నగరం: - విశాఖపట్నం (40 కిమీ)

సమీప బస్ స్టేషన్: - అనకాపల్లి, GVMC (5 కిమీ)

సమీప రైల్వే స్టేషన్: - అనకాపల్లి (4 కిమీ)

సమీప విమానాశ్రయం: - విశాఖపట్నం  (31 కిమీ)

సమీప వసతి, భోజన సౌకర్యం

బొజ్జన కొండ విశాఖ పట్నం నగర సరిహద్దుల్లో ఉన్నది. GVMC లో భాగం అయిన అనకాపల్లి లో (5 కిమీ) తక్కువ స్థాయి నుండి మధ్యస్త స్థాయి వరకు వసతి, భోజన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత శ్రేణి వసతి సౌకర్యాల కొరకు విశాఖ నగరం లో అందుబాటులో ఉన్నాయి.

No comments:

Post a Comment