Wednesday, 3 March 2021

గంధర్వ మహల్, అచంట, పశ్చిమ గోదావరి జిల్లా



పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట లో 1924 లో గొడవర్తి నాగేశ్వర రావు గారిచే నిర్మించబడింది. దీనిని స్థానికంగా పెద్ద మేడ గా వ్యహరిస్తారు. నాణ్యమైన రంగూన్ టేక్ తో నిర్మితమైన మూడంతస్తుల భవన శైలి ఆర్కిటెక్చర్ విద్యార్దులను ఆకర్షిస్తోంది. ఇందులో ఉన్న రవి వర్మ చిత్రాలకు, అందమైన అద్దాలు లకు ప్రసిద్ది చెందింది. ఈ భవనంలో ఉన్న పియానో ఇంగ్లాండ్ లోని వేలంలో సిల్వర్ అవార్డ్ పొందింది. 

location: 16.602400592673394, 81.80918545248703

గ్రామం/ పట్టణం: ఆచంట (గ్రామ పంచాయితీ, మండల కేంద్రం) జనాభా: సుమారు 20 వేలు.

రవాణా సదుపాయాలు 

ఆచంట కు నేరుగా రాజమహేంద్ర వరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం నుండి పరిమిత సంఖ్యలో ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు అందుబాటులో ఉన్నాయి. 

సమీప పట్టణం: - పాలకొల్లు (17 కిమీ)

సమీప ప్రధాన నగరం: - రాజమహేంద్రవరం (53 కిమీ)

సమీప బస్ స్టేషన్: - పాలకొల్లు (17 కిమీ)

సమీప రైల్వే స్టేషన్: - పాలకొల్లు (17 కిమీ)

సమీప విమానాశ్రయం: - రాజమహేంద్రవరం (67 కిమీ)

సమీప వసతి, భోజన సౌకర్యం

పాలకొల్లు (17 కిమీ) 

పాలవెల్లి రిసార్ట్స్, ఎలమంచిలి లంక (18 కిమీ)  

No comments:

Post a Comment