గోదావరి నదీ పాయలైన వశిష్ట, వైనతేయ మరియు మధ్య ఉన్న కోనసీమ ప్రాతం లోని నగరం దీవి కి సాగు నీటి సౌకర్యం కోసం మొదటి సారిగా సర్ అర్ధర్ కాటన్ 1859 సంవత్సరం లో వైనతేయ నదిపై పి.గన్నవరం వద్ద అక్విడెక్ట్ నిర్మించడం జరిగింది. దీనివలన గోదావరి నదీ జలాలు గోదావరి ని దాటి నగరం ద్వీపం లోని 45000 ఎకరాలకు సాగు నీరు లభిస్తోంది. కాటన్ నిర్మించిన ఈ అక్విడెక్ట్ శిధిలం కావడంతో 2000 సంవత్సరం లో దీని ప్రక్కనే కొత్త అక్విడెక్ట్ నిర్మించి ఆంధ్ర అన్నపూర్ణ గా పేరు పొందిన డొక్కా సీతమ్మ పేరు పెట్టడం జరిగింది. ఈ నూతన అక్విడెక్ట్ కి అనుబంధంగా రోడ్డు బ్రిడ్జ్ కూడా నిర్మించారు.
location: 16.58727347497836, 81.88529510867848 (పి.గన్నవరం, తూర్పు గోదావరి జిల్లా)
సమీప పట్టణం : అమలాపురం (14.2 కిమీ)
సమీప ప్రధాన పర్యాటక ప్రాంతం: రాజమహేంద్రవరం (54.4 కిమీ)
సమీప బస్ స్టేషన్: అమలాపురం (13.6 కిమీ)
సమీప రైల్వే స్టేషన్: పాలకొల్లు (36.9)
సమీప విమానాశ్రయం: రాజమహేంద్రవరం (67.0 కిమీ)
సమీప వసతి మరియు భోజన సదుపాయం: అమలాపురం (14 కిమీ), దిండి (23 కిమీ)
No comments:
Post a Comment