ఆదోని పట్టణ సమీపంలో ఉన్న ఈ కోట 15 వ శతాబ్దంలో నిర్మించిన అద్భుతమైన చారిత్రక ప్రదేశం. ట్రెక్కింగ్ చేయడానికి ఆసక్తి ఉన్నవాళ్ళకి ఇదొక ఆకర్షణీయ ప్రదేశం దేశంలోని పెద్ద కోటలలో ఇదొకటి. ఇది విజయ నగర సామ్రాజ్యంలోని సైనిక స్థావరం. విజయ నగర సామ్రాజ్య పతనానంతరం ఈ కోట బీజాపూర్ సుల్తానుల అధీనంలోకి వెళ్ళింది. తరువాత మొఘల్ సామ్రాజ్యం చేతుల్లోకి వెళ్ళింది, తరువాత హైదరాబాద్ నిజాంలు. టిప్పు సుల్తాన్ ఈ ప్రాంతాన్ని కొంతకాలం ఆక్రమించారు. టిప్పు సుల్తాన్ ఓటమి తరువాత, బ్రిటిష్ పాలనలోకి వచ్చింది.
ఈ కోటలో అనేక ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మరియు ఏడు భారీ గ్రానైట్ కొండల నడుమ ఈ కోట ఉంది. ఇది అనేక ఉప కోటల సమాహారం. కోట ప్రాంగణంలో నవాబ్ దర్బార్ హాల్, జామియా మసీదు, వేణు గోపాల ఆలయం, మాలిక్ రెహ్మాన్ దర్గా, శివాలయం, అంబ భవానీ ఆలయం మరియు అనేక నీటి వనరులు ఉన్నాయి. ప్రధాన కోట ప్రాంతం చాలా వరకు శిథిలావస్థలో ఉంది. కోటలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలను అన్వేషించడానికి సుమారు 4 గంటలు పడుతుంది.
location: 15.647445131217468, 77.27716745592302 (ఆదోని, కర్నూలు జిల్లా)
సమీప పట్టణం: ఆదోని (2.1 కిమీ)
సమీప ప్రధాన పర్యాటక స్థానం: కర్నూలు ( కి99మీ)
సమీప బస్ స్టేషన్: ఆదోని (4.1 కిమీ)
సమీప రైల్వే స్టేషన్: ఆదోని (4.2 కిమీ)
సమీప విమానాశ్రయం: రాయచూర్ (82 కిమీ)
సమీప విమానాశ్రయం: రాయచూర్ (82 కిమీ)
సమీప భోజన మరియు వసతి సదుపాయాలు : ఆదోని (2 కిమీ)
No comments:
Post a Comment