Sunday, 14 March 2021

కొల్లేరు పక్షుల సంరక్షణా కేంద్రం, ఆటపాక, కైకలూరు మండలం, కృష్ణా జిల్లా


కొల్లేరు సరస్సు భారతదేశం లోని అతి పెద్ద మంచినీటి సరస్సు. ఈ సరస్సు 623 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో ఏర్పడింది. ఎన్నో రకాల చేపలకు ఇది నిలయం. సైబీరియా, ర‌ష్యా, చైనా స‌హా ప‌లు దేశాల ప‌క్షి జాతులు వ‌స్తుంటాయి కొల్లేరు సరస్సులో 60% వరకు ఆక్రమణలకు గురై చేపల చెరువులుగా మారిపోయాయి. సరస్సు మధ్యలో ని లంకల్లో గ్రామాలున్నాయి. కేంద్రప్రభుత్వం 2009లో చిత్త‌డి నేల‌ల ప‌రిధిని పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. 2012లో కొల్లేరును ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్ర‌క‌టించింది. 1999 లో వన్యప్రాణి సంరక్షణా చట్టం, 1972 క్రింద కొల్లేరు పక్షుల సంరక్షణా కేంద్రం గా ప్రకటించింది.

location: 16.568588339102728, 81.22642864902909
ఆటపాక, కైకలూరు మండలం, కృష్ణా జిల్లా
సమీప పట్టణం: ఆకివీడు (18 కిమీ)
సమీప నగరం: విజయవాడ (79 కిమీ)
సమీప బస్ స్టేషన్: కైకలూరు (4 కిమీ)
సమీప రైల్వే స్టేషన్: కైకలూరు (3.5 కిమీ)
సమీప విమానాశ్రయం: విజయవాడ విమానాశ్రయం (3.5 కిమీ) 
సమీప భోజన మరియు వసతి సదుపాయం : కైకలూరు (4 కిమీ) & ఏలూరు (29 కిమీ) 

No comments:

Post a Comment