Saturday, 13 March 2021

శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంధాలయం, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా

 శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయాన్ని కవి మరియు సంఘ సంస్కర్త అయిన శ్రీ నాళం కృష్ణా రావు 1898 లో ప్రారంభించారు. దీనికి ప్రోత్సాహం ఇచ్చిన కందుకూరి వీరేశ లింగం గారి పేరు దీనికి పెట్టారు. 1920 లో రాజమహేంద్రవరం లోని శ్రీ అద్దంకి సత్యనారాయణ గారు స్థాపించిన వాసురయ గ్రంధాలయం తో కలిపి దీనిని గౌతమీ గ్రంధాలయం గా ఏర్పాటు చేశారు 

1900 సంవత్సరం కన్నా ముందు ప్రచురితమైన 1500 పైగా పుస్తకాలతో సహా మొత్తం 1.03 లక్షల తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ పుస్తకాలు ఈ లైబ్రరీ లో ఉన్నాయి. సుమారు 15000 అరుదైన పుస్తకాలు ఈ లైబ్రరీ లో ఉన్నాయి. 

12 వ శతాబ్దానికి చెందినవి, బ్రిటానికా ఎన్సైక్లోపీడియ 1771 లోని మొదటి ప్రచురణ, కల్నల్ మెకంజీ తెలుగు దస్తూరీ తో కూడిన పత్రాలు, అల్లూరి సీతారామరాజు విప్లవ సాహిత్యం, రాగి ఫలకాలు వంటి అరుదైన సేకరణ ఈ లైబ్రరీ లో చూడవచ్చు  




Location : 17.009024483241337, 81.77381144889402

రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా

సమీప పట్టణం & నగరం : రాజమహేంద్రవరం

సమీప బస్ స్టేషన్: రాజమహేంద్రవరం (3 కిమీ) 

సమీప రైల్వే స్టేషన్: రాజమహేంద్రవరం (3.5 కిమీ)

సమీప విమానాశ్రయం: రాజమహేంద్ర వరం (12 కిమీ)

సమీప వసతి మరియు భోజన సదుపాయాలు: రాజమహేంద్రవరం


No comments:

Post a Comment